Breaking

గుడిమల్లం( The 2200 year old Temple at Gudimallam....)


గుడిమల్లం


గుడిమల్లం(Near Tirupati )చిత్తూరు జిల్లాఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామము . చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయమునకు సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నది.
దేవాలయ చరిత్ర
 దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారుతదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు  దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేసారుకాకుంటే మూలవిరాట్ స్వామికి మాత్రం హాని   కలగలేదు.

గుడిమల్లం శివలింగ విశిష్టత

గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడుఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది ఆలయములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖమండపముల కన్నా లోతులో ఉంటుందిఇక్కడ గర్భగృహములో ప్రతిష్ఠించబడిన   శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగములింగము సుమారుగా ఐదు అడుగుల పొడవుఒక అడుగు వెడల్పు కలిగి ఉందిలింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగాచెక్కబడిన శివుడుఅపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తిరూపంలో ఉన్నాడుస్వామి రెండు చేతులతో ఉన్నాడుకుడిచేతితో ఒక గొర్రెపోతు  (తలక్రిందుగాయొక్క కాళ్ళు పట్టుకొనగాఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్పను పట్టుకొన్నాడుఎడమ భుజానికి ఒక   గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడుస్వామిజటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లుతలకట్టుతోచెవులకు అనేక   రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించినడుముచుట్టూ చుట్టిమధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము  (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రముధరించి ఉన్నాడు వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగాకనుపిస్తున్నాయి వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు    స్పష్టముగా కనుపిస్తున్నాయిస్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషంలింగపు అగ్రభాగము మరియు క్రింది   పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండిమొత్తములింగము,   పురుషాంగమును పోలి ఉంది లింగముఅతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడిందిఆకాలపు శైవారాధనకు ఒక   ఉదాహరణగా కూడా గుర్తించబడిందిగుడిమల్లం 2009 వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉందిపూజా   పునస్కారాలు ఏవీ జరగలేదుకనుక ప్రజలు ఎక్కువగా రాలేదుపురావస్తు శాఖ వారి ఉద్యోగిఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారుగుడిమల్లం చిన్న పల్లెటూరుతిరుపతికి సుమారు ఇరవై    రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడా అంటారుఅంత దూరం వెళ్ళి చూడ లేని వారికి  ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాలపోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారుఅక్కడ దీన్ని చూడవచ్చుప్రపంచంలో అత్యంత   పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉందిఇది క్రీస్తుపూర్వం 1 శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు

1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరంపాటు పరిశోధించి  శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడుప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల  శివ లింగం పై ఒక చేత్తో పశువునుమరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారుతలపాగాదోవతి ధరించిన  రుద్రుని వస్త్రధారణ రుగ్వేదకాలం నాటిదని శాస్త్రకారుల అంచనాప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే  లింగాన్ని   చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదుఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా  ఉంటుందిఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు లింగం చుట్టూ జరిపినతవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయిచోళపల్లవగంగపల్లవరాయల కాలంలో నిత్యం ధూపదీపనైవేద్యాలతో కళకళలాడిన  ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ   సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుందిఆనాటి నుండి గుడిలో పూజలుఆగిపోయాయిచాలా విగ్రహాలు చోరికి   గురయ్యాయి.
మరికొన్ని ఆలయ విశేషాలు
విశాలమైన  దేవాలయ ప్రాంగణమున యెన్నియో చిన్న గుళ్ళున్నవిఅన్నింటిని చుట్టునూఆవలి ఇటుక ప్రాకారగోడనలువైపుల ఉంది ప్రాకారమునకు పడమటివైపున పెద్ద గోపుర ద్వారము ఉంది గోపురద్వారము,మరియు    స్వామివారి అభిషేకజలమునకూ కట్టిన బావి యాదవదేవరాయలు కాలమునకు (క్రీ..13- 14శతాబ్దముచెందినదిముఖ్య దేవాలయముపరశురామేశ్వరస్వామి పేరున పలువబడుచున్నది ఆలయమునకు వాయవ్య దిశన అమ్మవారి దేవాలయము ఉందిదానిని ఆనుకొని దక్షిణమున వల్లీ-దేవసేనా సమేత కార్తికేయస్వామి గుడి ఉందిపై రెండును తూర్పు ద్వారమును కల్గిఉన్నవితూర్పు చివర ఆనుకొనిసూర్యనారాయణుని దేవాలయము ఉంది చిన్ని ఆలయమును బహుసా మరికొన్ని శిథిలములై ఉండవచ్చునుమరికొన్ని   పరివార దేవతల గుళ్ళు ఉన్నాయిఇవన్నీ బాణ చోళరాజుల (క్రీ. 9-12 శతాబ్దులుకాలమున చెందినట్టివిముఖ్య దేవాలయము గోడలపైనిరాతిపలకలపైని పెక్కు శాసనములు ఉన్నాయిఇవితరువాతి పల్లవులువారి సామంతులు గంగ పల్లవులు (క్రీ.. 897-905), బాణ చోళులుచోళరాజు విక్రమచోళుడురాజరాజు కాలమునకు చెందినవియాదవ దేవరాయల కాలమునాటికి చెందిన మరికొన్ని శాసనములు ఉన్నాయివిక్రమ చోళుడు కాలమున (క్రీ..1126) దేవాలమును పూర్తిగా తిరుగ కట్టినట్లురాతితోకట్టడములు చేసినట్లు తెలియుచున్నదిదేవాలయములో విశాలమైన మహామండపము గర్భగుడి ఆవలివైపు దాని ఆనుకొని ఎత్తైన రాతి ప్రాకారమును కలుపుచున్న అరుగునలుప్రక్కల ప్రదక్షిణమునకు వీలుగా స్తంభములపై శాల   నిర్మింపబడెను కాలమున మహామండపమునకు దక్షిణముగా ముఖదవారముదానికి నేరుగాప్రాకారమును కూడా కుడ్యస్తంభములతో చక్కని ద్వారశాలను ఏర్పరచిరిగర్భగుడి మాత్రము గజపృష్ఠాకారము కలిగి ఉందిఅందున అర్ధ మండపము మహామండపములు ఉన్నాయిఅన్నియు తూర్పు ముఖద్వారములు కలిగి ఉన్నాయిగర్భగుడిఅర్ధ-మహామండపముల కన్నచాలా పల్లములో ఉందిఅందువల్లనే కాబోలు గ్రామనామము గుడిపల్లము అని వాడుకలో   ఉందిశివుని ప్రతిమయవ్వనుడైన మల్లునిబోలి ఉన్నందున గ్రామనామము గుడిమల్లము అని ప్రతీతికాని శాసనములలో ఎక్కడా ఈనామము కానరాదు గ్రామమును విప్రపీఠముగా పేర్కొనబడెనుగుడిపేరు పరశురామేశ్వరాలయముగా చెప్పబడిందిచిత్రమేన  ఆలయమునెవ్వరు ప్రతిష్ఠించిరోఎప్పుడు జరిగినో శాసనములు తెలుపుటలేవుశాసనములు స్వామి వారి నిత్య సేవల కొరకు దానములు తెలుపుచున్నవిఇటీవలి పరిశోధనల ఫలితముగా ఇది క్రీ. పూ 1-2 శతాబ్దముసంబంధించిన లింగముగా భావింపవచ్చునుముఖ్య దేవాలయములోని మూలవిరాట్టు గుండ్రని రాతి పీఠములోని(యోని), లింగము (అడుగు భాగమున చతురస్రాకమైన స్తంభముఅమర్చబడెను పీఠములు చాలా నునుపుగా లింగ మెంత సుందరముగా నున్నదో అట్లున్నవికాని రాయి వేరుఇసుకరాయి యోని నిర్మాణము కేవలము స్త్రీ యోని నిర్మాణము బోలి యుండుట చాల చిత్రముగ ఉందిపీఠము చుట్టును 1.35 మీటర్లుపొడవుతో నలుప్రక్కల చతురస్రాకారం నిర్మించబడెనుదీని చుట్టును స్తంభము శైలిఅమరావతి-మధురల స్తూపవేదిక స్తంభములను బోలియుండుట గమనార్హము స్తంభ పలకములపైన వివిధ రీతుల పద్మములుపూలుచక్రములు మలచిఉన్నవి కాలమున దేవాలయ కట్టడము లేదుకేవలము లింగముపై ఆరుబయటపూజించబడునట్లు తెలియుచున్నది లింగముపైదానిపైన శివుని ప్రతిమ అతి ప్రాచీనమైన శైవపూజా విధానమును తెలుపుటయే కాక దక్షిణమున శైవ మత్యంత పురాతన మైనట్టిదని తెలియుచున్నదిఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై  లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి నాణాలు క్రీ.పూ. 3 శతాబ్ధానికిచెందినవిగా గుర్తించబడ్డాయిఅట్లె మధుర మ్యూజియంలో క్రీ.పూ.1  శతాబ్దమునకు చెందిన శిల్పము  లింగమును పోలియున్నదిఇది చెట్టు క్రింద ఎత్తైన ఆరు బయట వేదికలోనుంచిపూజించబడు లింగముగా గోచరించును లింగము ఊర్ధ్వరేతయైన మానవుని లింగమెట్లుండునో అట్లు చెక్కబడిందినరముల వెలేకనిపించును లింగమధ్యభాగముశివుని రూపములింగ ముఖభాగమునచాల చక్కని యవ్వనుడిగా చూపడం జరిగిందిస్వామి రెండు కన్నులు,   నాసికాగ్రమును చూచుటనుబట్టి విరూపాక్షుడగనుయోగ లేక ధ్యాన పురుషుడగను చెప్పుకొనవచ్చునుయెడమ భుజమ నానుకొని పరశు ఉందిచేతిలో కుండకుండ మరొకచేతిలో పొట్టేలు (మృగము-బహుశ చర్మమే కాబోలు), తల క్రిందులుగా పట్టుకొని ఉన్నాడుఇచ్చట శివుని భిక్షాటన మూర్తిగా పోల్చుకొనవచ్చును.   చక్కని ధోవతి మేఖలతో బంధించి యున్నను పురుషుని లింగము వెలికి యున్నట్లు చూపబడియుండుట చిత్రముగా   ఉందిఇతడిని మనము రుద్రుడుగా శిశ్నిన దేవుడుగా ఊహించుటసమ్ంజసముఋగ్వేద రుద్రుడుకి జంధ్యము లేదు   ప్రతిమలో యజ్ఞపవీతము కానరాదుపైగా స్వామి చలమూర్తిఅపస్మార పురుషుని భుజ స్కంధములపై ఉన్నాడు కావునలింగము వ్రేలాడు చున్నట్లు చాలా సాధారణముగా చూపబడెనుకానీ గమనించినచోశివలింగ మంతయు తీసికొన్నచో   ఊర్ధ్వ రేతమనే చెప్పక తప్పదు.శివుని తలపాగా చిత్రముగా ఉన్నదిపట్టబంధముతో నొసలు పైకిగా కట్టబడిందిలేతతాటి ఆకు అల్లి చుట్టినట్లున్నదిదీనిని బట్టి దక్షిణామూర్తిగానో లేక కపర్దిగనో ఉద్దేంశింపబడినాడుఇట్టి సంయుక్త ప్రతిమయే  తరువాత వివిధ రూపములలో ప్రత్యేకముగా శివుని చూపుటకు దోహదమై ఉండునని పలువురి అభిప్రాయముయేల   అనగా దేవాలయమును పూర్తిగా కట్టించిపెద్దదిగా చేసిన తరువాతపల్లవులుచోళులుబాణులు వివిధ రూపములలో శివుని ప్రతిమలను విడివిడిగా (దక్షిణామూర్తికంకాలమూర్తిపశుపతమూర్తివీణాధారిఉమాసహితమూర్తిదేవకోషములలో ఉంచిరి వేదిక లింగము చుట్టునుమ చేసిన త్రవ్వకములలో క్రీ..2-3 శతాబ్దములకుచెందినట్టిఇటుకలతో కట్టిన అర్ధగోళాకారపు గుడి-గోడకూడా బయల్పడినదిదీనిని బట్టి క్రీ..2-3 శతాబ్దములలో బహుశ శాతవాహనులుఇక్ష్వాకులు కాలమున  లింగము చుట్టును దేవాలయము కట్టిఉండవచ్చును ఆలయము శిథిలమగుటచే పల్లవులుబాణచోళులు దీనిని రాతితోఅదే ఆకృతిలో విశాలముగా కట్టి,కొన్ని మార్పులుకూర్పులు గావించిరిఅప్పటి వాస్తునుబట్టి లింగము చుట్టునున్న వేదికనుగుండ్రని యోని పీఠమునుపూడ్చి వేయటం జరిగింది.చతురస్రమైన చిన్న పీఠికను మాత్రము చేసి అభిషేకజలము పోవుటకు ప్రణాళిని గావించిరి.

No comments:

Powered by Blogger.