నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Yadav Telugu Actor)
నిఖిల్ సిద్దార్థ్ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు 1985 జూన్ 1 లో జన్మించాడు.
నేపధ్యము
హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.
జీవిత విశేషాలు
నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో జూన్ 1 1985 న జన్మించాడు. బేగం పేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్"గా చెప్పుకొనేవాడు. యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ లో చదువుకున్నాడు. ఆయన హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశంలో విడుదల కంటే ముందుగా టాలీవుడ్లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.
No comments: