చెన్నకేశవస్వామి ఆలయం, మార్కాపురం,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా
చెన్నకేశవస్వామి ఆలయం, మార్కాపురం
మార్కాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు రెవిన్యూ డివిజన్ కేంద్రము. పిన్ కోడ్ నం. 523 316 .ఎస్.టి.డి.కోడ్ = 08596
గ్రామ చరిత్ర
"కృతయుగే గజారణ్యే, త్రేతాయాం మాధవీపురీ ద్వాపరే స్వర్గసోపానం, కలౌ మారికాపురీ" అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు, కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా పిలుచేవారని అర్థం. మార్కాపురం చెన్నకేశవస్వామివారు అవతరించిన పుణ్యస్థలం. స్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షి రచించిన 'గజారణ్య సంహిత' ద్వారా మనకు తెలుస్తోంది.
శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలనలో ఉండినది.
పేరువెనుక చరిత్ర
కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'మారికాపురం' అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే 'మార్కాపురంగా' మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న 'చెన్నరాయుడుపల్లె'కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.
స్థలపురాణము
మార్కాపురములో చెన్నకేశవ స్వామి వారి ఆలయము నకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక పుణ్యక్షేత్రము.
మార్కాపురములో చెన్నకేశవ స్వామి వారి ఆలయము నకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక పుణ్యక్షేత్రము.
శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది.లక్ష్మీచెన్నకేశవస్వామివారికి ఎడమచేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడు. గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుకలోకొచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశారు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందున్న రాతిస్తంభాన్ని 'విజయసూచిక'గా ఆయనే నిలిపారు. పలనాటి రాజుల ఏలుబడిలో బ్రహ్మనాయుడు ఈ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ మధ్యరంగంలో మొత్తం 40 రాతి స్తంభాలున్నాయి. మధ్యరంగం చుట్టు నిర్మించిన రాయి వివిధ వంపులు తిరిగి మార్కాపురం చుంచు, దిగువపాలెం రచ్చబండ, అన్నదమ్ముల స్తంభాలు అని ప్రసిద్ధిలోకి వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం మొదటి అంతస్తుతోనే నిలిచిపోయింది. 1937లో మిగిలిన తొమ్మిది అంతస్తులను పూర్తిచేసుకుంది.
చెన్నకేశవస్వామి ఆలయం యొక్క స్థలపురాణం ప్రకారం, గుండికానది (ప్రస్తుతపు గుండ్లకమ్మ నది) తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేశి అనే రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి, విష్ణువుకై తపస్సు చేయగా కేశిని సంహరించడానికి ఆదిశేషున్ని పంపి, అతని విషజ్వాలలతో కేశిని అంతం చేసాడు. ప్రసన్నుడైన విష్ణువు, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా మహర్షి, విష్ణువును ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవునిగా ఇక్కడ వెలశారని ప్రతీతి.
శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గాలి గోపుర జీర్ణోధరణ కార్యక్రమం, 2013, నవంబరు 24 నుండి మొదలు పెట్టి, 27 తో, సంప్రోక్షణా కుంభాభిషేకంతో ముగిసినవి. మార్కాపురంలో తర్లుపాడు రహదారిలో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2015,ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారం నాడు, ఆదివారోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైనవి. ఉగాది పర్వదినానికి ముందు నెల (ఫాల్గుణ మాసం) లో వచ్చే ఆదివారాలలో అమ్మవారికి ప్రత్యేక మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని, రజత ఆభరణాలు, పట్టుచీరతో శోభాయమానంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు, వేకువఝామున ఐదు గంటల నుండియే, అమ్మవారి దర్శనానికి బారులుదీరినారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పొయ్యిలలో, మహిళలు పొగళ్ళు వండి, తరువాత, తమను చల్లంగ చూడమని కోరుకుంటూ వీటిని అమ్మవారికి సమర్పించారు. నాగమయ్య దేవతలు, నాగపుట్టల వద్ద భక్తులు పాలు పోసి పూజలు చేసారు.
చరిత్రలో మార్కాపురం
12 వ
శతాబ్దంలో పల్నాటి రాజు మలిదేవుడు గురజాలలో
జరిగిన కోడి పందేలలో ఓడి
పోయాడు. అపుడు రాజు తన
మంత్రి బ్రహ్మనాయుడితో కలిసి చెన్న కేశవుణ్ణి
పూజించాడు. ఈ విషయాన్ని శ్రీ
నాథుడు తన గ్రంథం పల్నాటి
వీర చరిత్రలో ప్రస్తావించాడు. 1513 లోశ్రీకృష్ణ దేవరాయలు స్వామి వారిని దర్శించుకొని, తన సామంత రాజు
తిమ్మ రాజయ్యను పిలిపించి స్వామి వారికి అంతరాళం, మహాద్వారం, గర్భగుడి పై విమాన గోపురం,
రాజ్య లక్ష్మి అమ్మవారికి
ఆలయాన్ని పూర్తి చేయమని ఆదేశించాడు. ఆ తర్వాత కాలంలోఅచ్యుత
దేవరాయలు ఈ ఆలయంలో లక్ష్మీ
నరసింహ స్వామి, వేణు గోపాల స్వామి,
రంగనాయక స్వామి, గోదాదేవి, రామానుజుల వంటి మరికొన్ని ఆలయాలను
నిర్మించారు. గాలి గోపురం వివిధ
దశలలో పూర్తి గావించ బడింది.1929 లో అప్పటి తాలూకా
గుమస్తాపోనంగి లింగ రాజు రెండు
అంతస్తులను నిర్మించాడు. మిగతా ఏడు అంతస్తులను
1936 లో నాటి మేజిస్ట్రేట్ రాయసం
సంహోగేశ్వరావు భక్తుల సహకారంతో పూర్తి చేశాడు. పురాతన కాలంనుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్నిసోమప్రభాపురం అని పిలిచేవారు.
క్షేత్ర విశిష్టత
స్వామి
వారి మూల విరాట్టు చుట్టూ
మకర తోరణం ఉంది. ఈ
తోరణం పై దశావతారాలున్నాయి. సాధారణంగా
స్వామివారి కుడి చేతిలో సుదర్శన
చక్రం ఉంటుంది. ఈ స్వామి వారి
ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంది. మూల
విరాట్టు ప్రక్కనే మార్కండేయ
మహర్షి,మారిక, మారకయ్యల విగ్రహాలు కూడా ఉన్నాయి. అస్థాన
మండపంలో ఉన్న స్థంభాలన్నీ ఏక
శిలా స్థంభాలే. ఈ ఆలయంలో ఉన్న
చూరు మరో ఆకర్షణ. అన్ని
విధాల ఒకే విధంగా ఉన్న
రెండు స్థంభాలను అన్నదమ్ముల స్థంభాలంటారు.
ఎలా వెళ్లాలి ?
ఒంగోలు
నుండి మార్కాపురానికి సుమారు 90 కిలోమీటర్లు. ఇది రోడ్డు మార్గం.
విజయవాడ కర్నూలు రైలు మార్గంలో మార్కాపురం
స్టేషను ఉంది. అలా చేరుకోవచ్చు.
No comments: