అనంతపురం జిల్లా
జిల్లా పేరు వెనుక చరిత్ర
అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతోమొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీదఅనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలముముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయల లోని బుక్కరాయల పేరుమీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణముగా బుక్కరాయ సముద్రము అను పట్టణము ఏర్పడినది.
జిల్లా చరిత్ర
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు పాలించాడనితెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవశతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులుఅనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈనొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లానుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకువీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందనితెలుస్తోంది. పదవ శతాబ్దంలో నొలంబులను జయించిఅనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనంచేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు.ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు.పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్నిపాలించారు. ఆపై హోయ్సళులు యాదవులుమొదలగు వారు అరువాతి శతాబ్ద కాలంలో ఈజిల్లాను పాలించారు. తర్వాత ఢిల్లీ నుండి పరిపాలనచేస్తున్నా ఖిల్జీ వంశస్థుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపైదండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చిహోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లోనైజాము రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రమునుకొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసిపట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారమునకు కాపలాగాఉన్న హరిహరరాయలు, బుక్కరాయలు లను కూడా బంధించితీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటకరాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చినహరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్నిస్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూవిజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది. 1677 నుండిఇది మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహివంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని తనస్వాదీనం లోనికి తెచ్చుకున్నాడు. క్రీ.శ. 1800 సంవత్సరంలోవచ్చిన సైన్య సహకార పద్దతి కారణంగా నిజాం నవాబు దీన్నిబ్రిటిష్ వారికి ఇచ్చేశాడు.
1. మైసూరురాజ్యము లోని యొకపల్లె. షిమోగాజిల్లాలోని సాగర్ తాలూకా లోనిది. షిమోగాకు29 మైళ్ళమీద నుండును. అంధాసురు డన్న రాజుచేనెనిమిదవ శతాబ్దియం దీగ్రామము కట్టింపబడియె. పదకొండవశతాబ్దియందిది చాళుక్యుల యాధీనమునం దుండెను. ఇది'సహస్రవిషయము ' (మండలము) లోనిది. 1042లొ నిది1200 బ్రాహ్మణుల కగ్రహారముగ నీయబడెను. 1079 లో నిదిరాజధానిగ జెప్పబడెను. పదినేడవ శతాబ్దియందు,కేలడిరాజయిన వేంకటప్పనాయకు డీగ్రామమునందుశివాచారమఠమును స్థాపించెను. చంపకసరసు అను చెరువుత్రవ్వించెను. గ్రామము పేరు 'ఆనందపుర ' మని మార్చెను.అదియే తరువాత అనంతపురముగ మాఱెను. హైదరు,టిప్పులు ఈ గ్రామముపై పెక్కుసార్లు దాడివెడలిరి. 1830లోతిరుగుబాటు కాలమున నీ గ్రామము దోపిడికి లోనయ్యెను.
2. అనంతపురము జిల్లాకు ముఖ్యపట్టణము.ఇది చెన్నపట్టణమునకు వాయువ్యమూలగ 216 మైళ్ల మీదనున్నది. ఇది చెన్నపురి దక్షిణ మహారాష్ట్రపు ఇనుపదారియొక్క గుంతకల్లు - బెంగుళూరుశాఖమీద నొకస్టేషను.
ఈ గ్రామము చిక్కప్ప ఒడయార్ అనునతడు కట్టించె ననిచెపుదురు. ఈతడు విజయనగరం రాజు అయిన ప్రథమబుక్కరాయలకు మంత్రిగనుండెను. ఈ యొడయార్ ఒక పెద్దచెఱువు కట్టించి, దానికి రెండు అలుగుల నుండి యొక్కువైననీరు పోవుటకు రెండు కత్వాలును, వానికి సమీపమున రెండుగ్రామములను కట్టించెను. అందొక గ్రామమునకు రాజుపేరిటబుక్కరాయ సముద్రము అని పేరు పెట్టి, రెండవదానికిదనభార్య యైన అనంతమ్మ పేరిట అనంతసాగర మని పేరుపెట్టెను. ఆ పేరే అనంతపురమని మాఱెను.
ఆకర్షణలు
1. లేపాక్షి ఆలయం (విజయనగరాజుల కాలంనాటిప్రసిద్ధ మురల్ చిత్రాలతో చూపరులకు ఆకర్షిస్తూఉంటుంది. లేపాక్షి ఆలయంలో శివుడు, విష్ణువుమరియు వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు.సుందర శిల్పకళ ఉట్టిపడే చిత్రాలతో అలంకృతస్తంభాల మీదతో నిలువెత్తు గాయకులు మరియునృత్యకారిణిల శిల్పాలు అనేక ఆకృతులలోచెక్కబడి ఈ ఆలయం చూపరులను ఆకర్షిస్తూమానసికోల్లాసము శక్తీ కలిగిస్తూ ఉంటుంది. ఈఆలయంలో ఉన్న నంది ప్రపంచ ప్రసిద్ధి చెందినదిఅలాగే అతి పెద్దది. (రాతితో చెక్కబడిన ఈ నందిశివుడికి వాహనము మరియు ద్వారపాలకుడుగాఉంటుంది) లేపాక్షి హిందూపూరు నుండి 14కిలోమీటర్ల దూరంలో ఉంది.
వీరభద్ర స్వామి దేవాలయం,లేపాక్షి
| వీరభద్రస్వామి దేవాలయం | |
|---|---|
గోపురం
| |
| పేరు | |
| స్థానిక పేరు: | వీరభద్ర దేవాలయం |
| స్థానము | |
| దేశము: | భారతదేశం |
| రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా: | అనంతపురం జిల్లా |
| ప్రదేశము: | లేపాక్షి |
| నిర్మాణశైలి మరియు సంస్కృతి | |
| ప్రధానదైవం: | వీరభద్రుడు |
| నిర్మాణ శైలి: | ద్రావిడ నిర్మాణ శైలి |
వీరభద్రస్వామి దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకొని ఉన్న రాముడు మరియు కృష్ణుడు యొక్క పురాణ గాథలకు సంబంధించినవి ఉన్నాయి. అచట పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటిగా అలరాలుతుంది.
ప్రదేశం
ఈ దేవాలయం లేపాక్షి నగరానికి దక్షిణవైపు నిర్మింపబడింది. ఈ దేవాలయం తాబేలు ఆకారంలో గల గ్రానైట్ శిలపై తక్కువ ఎత్తులో నిర్మింపబడింది. కనుక దీనిని "కూర్మ శైలం" అంటారు.
బసవయ్య విగ్రహం
ఇచట గల బసవయ్య 15 అడుగులు ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మండమైన విగ్రహం .108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియ చేస్తుంది. ఇక్కడ గల పాపనశేశ్వర స్వామిని అగస్త్య మగర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరికి ఒకరు ఎదురుగా పాపనశేశ్వరుడు, రఘునతమూర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత.విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు, రమణీయమైన ప్రదేశం. సీతమ్మవారిని అపహరించికొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాములవారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే ! పక్షి ! అని మోక్షం పప్రాసదించిన స్థలం. అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది.





No comments: