Breaking

ప్రకాశం జిల్లా(Prakasam District)



ప్రకాశం జిల్లా



భౌగోళిక చిత్రం: జిల్లాలో 56 మండలాలు ఉండగా.. వాటిలో 1030 గ్రామ పంచాయతీలు, ఒక (ఒంగోలు) నగర పాలక సంస్థ, మూడు (చీరాల, మార్కాపురం, కందుకూరు) పురపాలక సంఘాలు, నాలుగు (చీమకుర్తి, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు) నగర పంచాయితీలు ఉన్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతము 750.9 మి. ఈ వర్షపాతములో అత్యధిక భాగము నైరుతీ, ఈశాన్య ఋతుపవనముల వల్ల ఈ జిల్లాలో సంభవిస్తుంది. జిల్లాలో వేసవి కాలములో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. సాధారణ అత్యధిక సగటు ఉష్ణోగ్రత 39.6 డిగ్రీ సెల్షియస్‌. ఫిబ్రవరి నుండి ఉష్ణోగ్రత క్రమంగా మే వరకు పెరుగుతూ అదిక్రమంగా మళ్ళీ డిసెంబర్‌కు తగ్గిపోతుంది. జిల్లాలో 41.1 శాతం నల్లరేగడి నేలలు, 51 శాతం ఎర్రరేగడి నేలలు, 6 శాతం ఇసుక నేలలు, ఇతర మిశ్రమ నేలలు కలిగి ఉన్నది. జిల్లా పశ్చిమ ప్రాంతం అధికంగా ఎర్రనేలలైనప్పటికి కొండలు, రాతి గుట్టలతో నిండి ఉంటుంది.

నాటి కనగిరి.. నేటి కనిగిరి. పల్లవ చోలరాజులు, కాకతీయులు, యాదవులు, రెడ్డిరాజులు గజపతులు, విజయనగరాధీశులు, నవాబులు, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు, జమిందారుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రాత్మక ఆధారాలున్నాయి. కనిగిరిని ఆనుకుని రెండు ఎత్తయిన కొండల మధ్య అభేధ్యమైన కోటను నిర్మించుకుని ఆనాటి రాజులు పాలన సాగించారు. రాజులు నిర్మించిన కోటగోడలు, బురుజులు, దేవాలయాలు, చెరువులు, ఏనుగులు, గుర్రాలశాలలు, మందుగుండు సామాగ్రిదాచే నేళమాళిగ నేడు శిథిలావస్థలో యాత్రికులకు దర్శనమిస్తున్నాయి. పల్లవరాజు మహేంద్ర, ఆయన తర్వాత మహామళ్లు మహరాజుల పాలన 6-7 శతాబ్ధంలో కనిగిరిలో ఉంది. పల్లవ రాజుల కాలంలోనే బైరవ కోన క్షేత్రం ప్రాభవం పొందింది. భైరవకోన నుంచి కనిగిరి కోటకు అలాగే అనుమలగిరికి సొరంగ మార్గాలు ఉన్నాయి. శత్రురాజులు కోటలను ముట్టడించినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ సొరంగ మార్గాలనునిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు.ఘన చరితల అనుబంధం 
నెల్లూరు, కర్నూలు, గుంటూరు, జిల్లాల నుంచి కొన్ని తాలూకాలను విడగొట్టి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేసినందున ఆ మూడు జిల్లాల చరిత్రతోనే ఈ జిల్లా చరిత్ర పెనవేసుకుని ఉంది. ఆంధ్ర శాతవాహనుల పతనానంతరం గుంటూరు, కర్నూలు, నెల్లూరు, జిల్లాలలోని కొంత ప్రాంతాన్ని ఇక్ష్వాకులు పాలించారు. వారి పాలనలో ఈ ప్రాంతాన్ని పూగినాడుగా పిలిచేవారు. కాలక్రమంలో పాకనాడుగా రూపొందిన ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. క్రీస్తు శకం మూడవ శతాబ్దం చివరన పల్లవులు స్థాపించిన సామ్రాజ్యంలో ఈ ప్రాంతం చేరి ఏడో శతాబ్దం వరకు కొనసాగింది. క్రీ.శ. 611లో పశ్చిమ చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేసి పల్లవుల నుంచి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నాడు. క్రీ.శ. 9వ. శతాబ్దంలో కనిగిరి తాలూకాలోని బోయనాయకులు స్వతంత్రులై రాజ్యాన్ని స్థాపించారు. వారిని అణచటానికి గుణగవిజయాధిత్యుని సేనాని పండరంగడు ఈ రాజ్యంపై దండెత్తాడు. కనిగిరి, పొదిలి, దర్శి, కందుకూరు తాలూకాలతోబాటు కొంత నెల్లూరు సీమను వశపర్చుకున్నాడు. తూర్పు చాళుక్య దక్షిణ రాజ్యానికి 13 శతాబ్దంలో కనిగిరి తాలూకాలో కొంత ప్రాంతాన్ని కాటమరాజు పాలించాడు. నెల్లూరును పాలిస్తున్న మనుమసిద్ధికి కాటమరాజుకు పుల్లరి విషయంలో పేచీ వచ్చింది. వారిద్దరికీ పాలేరునది ఒడ్డున పంచలింగాల కొండ వద్ద క్రీ.శ. 1261లో యుద్ధం జరిగింది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో 1324లో ప్రోలయవేమారెడ్డి అద్దంకి రాజధానిగా కొండవీటి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. 1427లో విజయనగరరాజులు కందుకూరు రాజ్యాన్ని జయించి 1570 వరకు పాలించారు. కనిగిరి దుర్గం, కంభంచెరువు, విజయనగరరాజులు కట్టించినవేనని భావింపబడుతుంది. వీరి తర్వాత ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల వశమైంది. అనంతరం కర్నాటక నవాబులు జయించారు. 1811లో కర్నాటక నవాబు రాజ్యమంతా భ్రిటిష్‌వారి వశం కావడంతో ఈ ప్రాంతం స్వాతంత్య్రం వచ్చేవరకు కూడా వారి ఆధీనంలోనే ఉంది. 


No comments:

Powered by Blogger.