చంద్రగిరి కోట
చంద్రగిరి కోట
చంద్రగిరి,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలం,రెవిన్యూ డివిజన్
కేంద్రము
ఇది సమీప పట్టణమైన తిరుపతి
నుండి 12 కి. మీ. దూరంలో
ఉంది.
చంద్రగిరి కోట
చంద్రగిరిలో
1640లో కట్టబడిన కోట ఉంది. శ్రీ
కృష్ణదేవరాయలు ఆస్థానములో వుండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. అర్ధ చంద్రాకారంగా ఉన్న
కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన
దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచే వారు.
ఇలా నిర్మించుట వలన కోట రక్షణ
కొండ ప్రాంతమువైపుగా తగ్గగలదనీ కొండపైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించుట సులభం కనుక కొండ
ప్రక్కగా నిర్మించారనీ మ్యూజియంలో సమాచారముద్వారా తెలుస్తున్నది.కోట చుట్టూ దాదాపు
కిలో మీటరు దృఢమైన గోడకలదు
ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన
రాళ్ళ పరిమాణం చాలా పెద్దది. దీనిని
ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది.ఈ గోడ పొదల
తుప్పల మధ్య ఇప్పటికీ చెక్కు
చెదరక ఉంది. ఈ గోడననుసరిస్తూ
బయటి వైపుగా పెద్ద కందకము ఉంది.
ప్రస్తుతము పూడిపోయిననూ అప్పటి కాలమందు ఇందులో మొసళ్ళను పెంచే వారట.
విజయనగర
రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం
వహించింది.కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహనిర్బంధములో ఉంచారు.
క్రీ.శ.1585లో విజయనగర
సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాక విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ళ
పాటు పెనుకొండకు మార్చారు. పెనుకొండ తర్వాత ఇంకొన్నేళ్ళకు చంద్రగిరికి మారిపోయింది. చంద్రగిరి నుండి పాలించిన చిట్టచివరి
విజయనగర రాజు పెద వేంకట
రాయలు, తన సామంతుడు దామెర్ల
చెన్నప్ప నాయకుడు 1639 ఆగస్టు 22లో బ్రిటీషు ఈస్ట్
ఇండియా కంపెనీకి చందిన ఫ్రాన్సిస్ డేకి
చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతిచ్చింది.ఈ కోట నుండే
ఇప్పటికీ ఆనాటి దస్తావేజులను మ్యూజియంలో
చూడవచ్చు. కొండ పై భాగమున
ఒక సైనిక స్థావరము నిర్మించారు.
వారి అవసరముల నిమిత్తము పై భాగమున రెండు
చెరువులను నిర్మించి క్రింది నున్న పెద్ద చెరువు
నుండి పైకి నీటిని పంపించేవారని
కోటలో మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తుంది.(ఇప్పటికీ కొండపైకి నీటిని పంపించుట అనేది పెద్ద మిస్టరీ).అప్పుడు పైకి పంపించేందుకు ఉపయోగించిన
సాధనాలు పాడయిపోయాయి.అయితే పైన చెరువు,
క్రింద చెరువు ఇప్పటికీ మంచి నీటితో కనిపిస్తాయి.
రాణీ మహల్ రెండు అంతస్తులుగానూ,
రాజ మహల్ మూడు అంతస్తులుగానూ
ఉంది. రాణీ మహల్ చాలా
వరకు పాడయిపోయింది. రాణీ మహల్ పేరుకే
రాణీమహల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు.
కానీ దీని వాస్తునుబట్టి ఇది
ఒక గుర్రపు శాల కావచ్చని అక్కడి
బోర్డునందు వ్రాసి ఉంది. పురావస్తు శాఖ
అధీనములోకొచ్చిన తరువాత కొంత వరకూ బాగు
చేశారు. రాణీమహల్ వెనుక కొంచెం దూరంగా
కోట నీటి అవసరాలకోసం ఒక
దిగుడు బావి ఉంది. దీనినుండే
అంతపుర అవసరాలకు నీటిని సరఫరా చేసే వారని
తెలియ చేయబడింది. ఈ బావికి కొద్ది
దూరములో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి
తీసేందుకు ఆరు స్తంభాలు కలిగి
ఉపరితలమునకు నాలుగు రింగులు ఉన్న చిన్న మండపము
ఉంది. రాజమహలులో మొదటి అంతస్తును మ్యూజియంగా
మార్చారు. ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన
శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో ఉన్నాయి. రెండవ అంతస్తులో సింహాసనాలతో
కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని
చూడచ్చు. మూడవ అంతస్తులో అప్పటి
కోట నమూనా, ప్రజలజీవన విధానం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే
అంతస్తులో రాజప్రముఖుల గదులు ఉన్నాయి. చాలా
వరకూ పాడైన దేవాలయాలు వదిలేసి
కొంత బాగున్న రాణీమహల్ మరియు రాజమహలు, వీటివెనుక
ఉన్న చెరువు మొదలయినవాటిని బాగుచేసి కొంత వరకూ తోటను
వేసి అన్ని చోట్లా మొక్కలు
పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు. రాజమహలుకు వెనుక ఖాళీ ప్రదేశంలో
పెద్ద ఓపెన్ దియేటర్ మాదిరిగా
మార్చి, దృశ్య కాంతి శబ్ధ
(సౌండ్,లైటింగ్ షో) ప్రదర్శనం చేస్తారు.
ఈ ప్రదర్శనకు 45/- రూపాయలు సామాన్య రుసుము ఉంది. నారా చంద్రబాబు
నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఐదు కోట్ల రూపాయల
మొత్తముతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు
చేశారు. ఈ ప్రదర్శన ద్వారా
పెనుకొండ, చంద్రగిరి సంస్థానాలు ఎలా నాశనమయిపోయాయో కళ్ళకు
కట్టినట్లుగా కాంతి, శబ్దాల ద్వారా వివరించబడుతుంది. ఈ ప్రదర్శన తెలుగు
మరియు ఆంగ్ల భాషయందు ఉంది.
ఆంగ్ల భాషలో వ్యాఖ్యానము అమితాబ్
బచ్చన్ స్వరంలో వినవచ్చు.
చంద్రగిరిలోని దేవాలయములు
- ములస్తానమ్మతల్లి దేవస్తానం
- మిట్ట గంగమ్మ తల్లి దేవస్తానం
- పంచ పాండవులు, ద్రౌపతీదేవి దేవాలయం
- సువర్ణముఖీ నది ఒడ్డున ఉన్న పాడుబడ్డ దేవాలయాలు
- తొండవాడకు వెళ్లే మార్గంలో ఎడమవైపున పొలాల్లో పురావస్తువేత్తలు భద్రపరచిన పాడుబడ్డ దేవాలయం
- చంద్ర గిరి కోట పరిసరాల్లోని అనేక పాడుబడ్డ దేవాలయాలు (వీటినే సౌండ్ అండ్ లైట్ షోలో అధ్బుతంగా ఉపయోగించుకున్నారు)
- నర్శింగాపురం/శ్రీనివాసమంగాపురం దారిలోని శివాలయం.
- చంద్ర గిరి సెంటర్ లో నమాజ్ టైంలో మోగించే పెద్ద అలారం స్తంభం!
(OR)
http://sreekrishnadevaraya.blogspot.com/2010/07/blog-post_18.html
విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక చంద్రగిరి కోట. విజయ నగర యుగం నాటి సంస్కృతి, వైభవం సజీవంగా ఉట్టిపడే రాజ మహల్, రాణీమహల్, ఇతర కట్టడాలన్నీ చూపరులను ఆకర్షిస్తున్నా యి. తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ మహా కట్టడం 10 దశాబ్ధాలు పూర్తయినా నేటికి సజీవంగా చెక్కు చెదరని కళావైభవం కళ్ల కు కట్టినట్లు కనబడుతుంది. సుందర లోయ లో గంభీరమైన రాజప్రసాదాలు, సొంపైన తటాకాలు, శిలామండపాలు విజయనగర సామ్రాజ్య ప్రభువులకు మూడవ రాజధాని నగరమై విరాజిల్లిన చంద్రగిరి కోట అంటే నాటి వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం.
పురాణ గాధలను అనుసరించి ఇక్కడ ఎతైన ఒక కొండపై చంద్రుడు తపమాచరించి శివుడిని ప్రసన్నం చేసుకొని వరం పొందాడని అందువలన నాటి నుంచి చంద్రగిరి అనే పేరుతో ఈ ప్రాంతం ప్రాచుర్యా న్ని పొందింది. చరిత్రను అనుసరించి క్రీ.శ. 1000 సంవత్సరం నాడు చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉన్న నారాయణవనాన్ని పరిపాలిం చిన ఇమ్మడి నరసింహ యాదవ రాయలవారు ఈ కోట నిర్మించారు. ఈ కోట చుట్టూ ప్రాకారాలను అనుసరించి పెద్ద శిలలతో నిర్మించిన చదరపు రుజువులు ఉన్నాయి. కోట గోడలను ఆనుకొని అగడ్తలు ఉండేవి.
దుర్గానికి ఇరువైపులా ప్రవేశ ద్వారాలున్నాయి. స్థానిక చరిత్ర ప్రకారం చంద్రగిరి కోట 314 సంవత్సరాలు యాదవ రాజుల ఆధీన ములో ఉంది. చంద్రగిరి ప్రాంతానికి ప్రభువుగా ఉండి, ఆ కోటలోనే నివసించిన ఘనత అప్పటి యాదవరాజులకే దక్కింది. ఆ తరువాత హంపిలో విజయనగర చక్రవర్తులు శక్తి కోల్పోయి రాజ్యభారము వహించలేక శత్రువు విజయనగర సామ్రాజ్య ఆధిపత్య భారమును తీసుకొని పేరు ఘడించారు. నరసింహరాయుల కాలమున క్రీ.శ. 1565లో సంభవించిన రాకాతి తంగడి (తళ్లికోట) యుద్ధంలో విజయ నగర ప్రభువులు పరాజితులై గత్యంతరము లేక కర్నాటక రాష్ట్రానికి చెందిన హంపి నుంచి పెనుగొండ (అనం తపురం జిల్లా) చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి పట్టణానికి తరలించారు.
ఆ నాటి నుంచి చంద్రగిరి కోట పలు చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలచింది. క్రీ.శ. 1000వ సంవత్స రంలో ఇమ్మడి నరసింహ యాదవ రాయుల చే నిర్మించిన చంద్రగిరి కోటలో ఆముఖమై ఉన్న భవనాన్ని రాజమహల్ అని పేర్కొంటా రు. ఈ భవన నిర్మాణం అంచలంచెలుగా పూర్తి చేస్తూ 16వ శతాబ్ధం నాటికి ఈ కట్ట డం పూర్తయినట్లు చరిత్రకారుల అంచనా. మూడంతస్థులతో గంభీరంగా ఈ భవనం దర్శనమిస్తోంది. రాజమహల్ పైన ఉన్న మూ డు గోపురాలలో పెద్ద గోపురం 24 చదరపు అడుగుల వైశాల్యం గల దర్బారు మాలులోని మధ్య గోడలు లేని స్తంభ పంక్తి రెండంతస్థుల ఎత్తు వరకు ఉంది. ఈ ఏర్పాటు వలన దర్బారులో కి తగినంత గాలి, వెళుతురు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.
భవ నం పునాదులు రాతితోను, పై భాగాన్ని ఇటుక, కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డులోని తెల్లసొన తదితర మిశ్రమాలతో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో ఎక్కడా కూడా కలప వినియోగించకపోవ డం ప్రత్యేక విశేషం. పరదాల ఏర్పాటుకు కూడా గోడలలోనే ఏర్పాటు చేసి ఉంచారు. రాజమహల్పైన ఉన్న గోపురాల్లో ఏర్పాటు చేసిన రం ధ్రాలు లోపలివైపు బంగారు ఆభరణాలు, నిధులు నిక్షిప్తం చేయబడిన ట్లు స్థానికులు పేర్కొంటారు. ఇలా నాటి రాజుల వైభవాన్ని నేటికీ కళ్లకు కట్టినట్లు చూపించే మహల్ వైభవాన్ని తనివితీరా చూడాల్సిందే.
అంత కాకుండా పంచలోహ విగ్రహాలు శైవ, వైష్ణవ , జైన మతాలకు చెందిన శిలా కాంస్య నిర్మితమైన దేవతా ప్రతిమలు ఈ కోటలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచిన విజయనగర చక్రవర్తుల సేవకు గుర్తింపు గా శ్రీకృష్ణ దేవరాయులు, ఆయన దేవేరులు తిరుమలదేవి, చిన్నాంబిక లు, వెంకటపతిరాయులు, శ్రీరంగరాయులు తదితరుల శిలా ప్రతిమ లు సహజతత్వాన్ని ఉట్టిపడేలా కనిపిస్తాయి.దక్షిణ భారతదేశంలోని అ న్ని రాష్ట్రాల నుంచి తిరుపతి పట్టణానికి రైలు ప్రయాణ సౌకర్యం ఉంది. తిరుపతి నుంచి ఆర్టిసి బస్సులలో చం ద్రగిరి పట్టణానికి చేరుకోవచ్చు. తిరుపతి పట్టణానికి చేరువలో రేణిగుంట విమానా శ్రయం కూడా ఉండటం విశేషం. యాత్రి కుల సౌకర్యం కోసం చంద్రగిరి నుంచి రాజమహల్ పురావస్తు ప్రదర్శనశాలకు వెళ్లడానికి ఆటోలు, రిక్షాలు నడుస్తున్నాయి
No comments: